ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాప్‌ రూపకర్తకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాప్‌ రూపకర్తకు సన్మానం

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాప్‌ రూపకర్తకు సన్మానం

మెదక్‌ అర్బన్‌ /పెద్దశంకరంపేట(మెదక్‌): ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాప్‌ రూపకర్త, మెదక్‌ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బృంగి ప్రసన్నకుమార్‌ను సమగ్ర శిక్ష జాయింట్‌ డైరెక్టర్‌ ఏ ఉషారాణి శుక్రవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్లో పునాది అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం అభివృద్ధికి కృత్రిమ మేథస్సు ఆధారంగా రూపొందించిన ఎఫ్‌ఎల్‌ఎన్‌ మొబైల్‌ యాప్‌ ఒక వినూత్నమన్నారు. విద్యార్థుల స్థాయి కనుగుణంగా కార్యకలాపాలు, ప్రశ్నలు, గేమ్స్‌ అందించే ఈ యాప్‌ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, టీచర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎటువంటి కార్పొరేట్‌, వాణిజ్య సంస్థల సహకారం లేకుండా, సొంత ఆర్థిక వనరులతో , స్వీయ పరిశోధన ద్వారా యాప్‌ అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇది ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఊతమిస్తుందన్నారు. బృంగి ప్రసన్నకుమార్‌ కృషిని డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, ఏఎస్‌ఓ నవీన్‌ కుమార్‌, టీచర్లు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement