ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్లతో సర్ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అందుబాటులో లేని ఓటర్లకు కూడా సమాచారం అందించాలన్నారు. గడువులోగా వారు తమ ఎన్యూమరేషన్ ఫారంలు తిరిగి అందించేలా చూడాలన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారి ఎన్యూమరేషన్ ఫారంలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. వివరాలు సరి చూసుకున్న మీదట వారి కుటుంబ సభ్యుడి సంతకంతో తీసుకోవచ్చని సూచించారు. ఎన్యూమరేషన్ ఫారంల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్‌ను ఏకకాలంలో సమాంతరంగా నిర్వహించాలని సూచించారు. అంతకుముందు న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ పవన్‌కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ప్రతిమాసింగ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, ఎన్నికల సూపరింటెండెంట్ గఫార్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


