రాజకీయాలకతీతంగా అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా అభివృద్ధి

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

నర్సాపూర్‌: రాజకీయాలకతీతంగా నర్సాపూర్‌ అభివృద్ధికి కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. మున్సిపాలిటీలోని పదవ వార్డులో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలన్నారు. గతేడాది మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.15కోట్లు మంజూరు చేసిందని, వాటితో పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ప్రతీ వార్డులో రూ.30లక్షలతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. పదవ వార్డులో మురికి కాలువ నిర్మాణానికి అదనంగా నిధులు కావాలని కాలనీ ప్రజలు కోరడంతో నిధులు మంజూరు చేయిస్తానని సునీతారెడ్డి హామీ ఇచ్చారు. ఆమె వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, మున్సిపల్‌ మేనేజర్‌ మధుసూదన్‌, వైస్‌ చైర్మన్‌ బుచ్చేష్‌యాదవ్‌, కౌన్సిలర్లు రాజు, మోహిజోద్దీన్‌, ఆయా పార్టీల నాయకులు శేఖర్‌, భిక్షపతి, బాల్‌రెడ్డి, అశోక్‌గౌడ్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement