మోగని తబలా.. పలకని స్వరాలు | - | Sakshi
Sakshi News home page

మోగని తబలా.. పలకని స్వరాలు

Jul 8 2026 9:32 AM | Updated on Jul 8 2026 9:32 AM

మోగని తబలా.. పలకని స్వరాలు శిక్షకులను నియమిస్తాం

శిక్షకులు లేక మూలన పడ్డ వాయిద్య పరికరాలు

జిల్లాలో 13 పీఎంశ్రీ పాఠశాలలకు మంజూరు

మొత్తం రూ.19.50 లక్షలు మంజూరు

సారి సంగీత వాయిద్య శిక్షణ కోసం శిక్షకులను నియమిస్తాం. గతేడాది నిర్ణయించిన, అర్హతలు లేక పోవడంతో నియామకం చేయలేక పోయాం. అర్హతలను బట్టి కాకుండా, నైపుణ్యాలను బట్టి అర్హత గల వ్యక్తులను ఎంపిక చేసి వాయిద్య పరికరాలను అందుబాటులోకి తెస్తాం.

–సుదర్శనమూర్తి, ఏఎంఓ

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు..ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి పెంచేందుకు ప్రభుత్వం వాయిద్య పరికరాలు పంపిణీ చేసింది. జిల్లాలో ఎంపిక చేసిన 13 ప్రధాన మంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పాఠశాలలకు గతేడాది వాయిద్య పరికరాలు పంపిణీ చేశారు. అయితే శిక్షకులను నియమించకపోవడంతో ఆ పరికరాలు మూలన పడ్డాయి.

మెదక్‌ అర్బన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను పరిపూర్ణ వికాసవంతులుగా తీర్చి దిద్దేందుకు..బట్టీ చదువులకు స్వస్తిచెప్పి..మానసిక ఉల్లాసానికి పెద్దపీఠ వేస్తూ..వారిలో అంతర్లీనంగా దాగివున్న నైపుణ్యాలు వెలికి తీసేందుకు గాను వ్యాయామ, సంగీత, చిత్రలేఖన, వృత్తి విద్యలను పీఎంశ్రీ స్కూళ్లలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పాఠశాలలకు ల్యాప్‌టాప్‌లు, క్రీడా సామగ్రి, సంగీత పరికరాలు, డిజిటల్‌ బోధనోపకరణాలు పంపిణీ చేశారు.

జిల్లాలో13 పాఠశాలలకు రూ.19.50 లక్షలు

మెదక్‌ జిల్లాలో మొత్తం 31 పీఎంశ్రీ స్కూళ్లు ఉండగా, 13 పాఠశాలలకు వాయిద్య పరికరాలు పంపిణీ చేశారు. ఒక్కో పాఠశాలకు శిక్షకుల జీతాల కోసం రూ.1.50 లక్షల మంజూరయ్యాయి. విద్యాశాఖ నుంచి తబలా, హార్మోనియం, వయోలిన్‌, డోలక్‌లు పంపిణీ అయ్యాయి. శిక్షకుల జీతాల కోసం జిల్లాకు రూ.19.50 లక్షలు మంజూరయ్యాయి. వీటి శిక్షణ కోసం ప్రత్యేక గది కేటాయించాలని సూచించారు. విడతల వారీగా ఇతర పాఠశాలలకు కూడా పంపిణీ చేసే అవకాశం ఉంది.

శిక్షకులే లేరు.. శిక్షణ ఎలా!

వాయిద్య పరికరాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక్కో పాఠశాలకు ఒక్కో టీచర్‌ను నియమించాలి. వీరికి నెలకు రూ.పది వేల చొప్పున జీతాలివ్వాలి. ఈ మేరకు 6 నెలల జీతం అడ్వాన్సుగా విడుదల చేసింది. అయితే మ్యూజికల్‌ టీచర్‌ ట్రైనింగ్‌ చేసిన వారినే శిక్షకులుగా నియమించాలి. కానీ శిక్షణ పొందిన అభ్యర్థులు లేకపోవడంతో గత విద్యా సంవత్సరం అసలు శిక్షకులనే నియమించలేదు. దీంతో చాలా పాఠశాలల్లో వాయిద్య పరికరాలు అలమారాలకే పరిమిత మయ్యాయి. మరికొన్ని పాఠశాలల్లో మూలన పడేశారు.

శిక్షకులు లేక పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement