కలెక్టర్‌ ఆదేశంతో తీరిన సమస్య | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఆదేశంతో తీరిన సమస్య

Jul 7 2026 6:46 AM | Updated on Jul 7 2026 6:46 AM

కలెక్టర్‌ ఆదేశంతో తీరిన సమస్య

అల్లాదుర్గం(మెదక్‌): అల్లాదుర్గం జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో మూత్రశాలలు నిర్మించినా, పైకప్పు లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయం హెచ్‌ఎం అల్లాదుర్గం మండలానికి వచ్చిన కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ సర్పంచ్‌ సౌమ్యను ఆదేశించడంతో వెంటనే పరిష్కరించారు. పైకప్పు రేకులు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 50 వేలతో ఈ పనులు వెంటనే చేయడంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌తో పాటు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement