మా పిల్లల చదువు ఎలా? | - | Sakshi
Sakshi News home page

మా పిల్లల చదువు ఎలా?

Jul 7 2026 6:46 AM | Updated on Jul 7 2026 6:46 AM

‘బెస్ట్‌ అవైలబుల్‌’ విద్యార్థుల తల్లిదండ్రుల ధర్నా

మెదక్‌ కలెక్టరేట్‌: తమ పిల్లలను పాఠశాలల్లోకి రానివ్వడం లేదని.. గత మూడేళ్లుగా ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుందని బెస్ట్‌ అవైలబుల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా లోని 477 మంది ఎస్సీ విద్యార్థులు పలు ప్రైవేట్‌ పాఠశాలల్లో బెస్ట్‌ అవైలబుల్‌ పథకం కింద ఎంపికై చదువుతున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు రావడం లేదు. దీంతో వారు విద్యార్థులను బడుల్లోకి రానివ్వడం లేదు. దీంతో సోమ వారం కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించారు. ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే పిల్లలను హాస్టళ్లలో ఉంచి ఇతర ప్రాంతాల్లో పనులు చేసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి సమస్యను తల్లిదండ్రులు విన్నవించారు. వారికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, దళిత సంఘాల నాయకుడు సురేశ్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలను పిలిపించి చర్చించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement