డీసీఓ పద్మ
మెదక్‌కలెక్టరేట్: రైతుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని డీసీఓ పద్మ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని డీసీఓ కార్యాలయంలో సహకార సంఘాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ను సకాలంలో అందించాలని సూచించారు. అలాగే సంఘాల ద్వారా రైతులకు ఇచ్చిన రుణాలను త్వరితగతిన రికవరీ చేసి సంఘాల అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మెదక్, వెల్దుర్తి, కొత్తపల్లి, నర్సాపూర్ సొసైటీలకు మెమోంటోలు అందజేశారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పాపన్నపేట, వరిగుంతం సొసైటీల సెక్రటరీలు నవీన్, రాములును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సాయిలు, ఇతర సొసైటీల అధికారులు, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.


