ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
సంగారెడ్డి జోన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసి మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే నియామక ప్రక్రి య చేపట్టనున్నారు. కాగా, జిల్లాలోని 4 సబ్ డివిజన్, 7 సర్కిల్ కార్యాలయాలతో పాటు 30 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా స్టేషన్లలో 412కు పైగా కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారే ముఖ్యమైన సభలు, సమావేశాలు ఉన్న సమయంలో ఇతర ప్రాంతాల్లో బందోబస్తుగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022లో చివరిసారిగా పోలీసు శాఖలో ని యామకాలు చేపట్టి 2023లో సుమారు 400కు పై గా కానిస్టేబుల్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది.
విడతలవారీగా భర్తీకి అవకాశం
ఖాళీగా ఉన్న పోలీసు అధికారుల నియామక ప్రక్రి య విడతల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 6,000కు పైగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. మరికొన్ని విడతల్లో మిగతా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలో సుమారు 110 పోస్టులు భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఒకే దశలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో నోటిఫికేషన్
జిల్లాలో 412 కానిస్టేబుల్ పోస్టులు


