చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి పోర్టల్ సర్వర్ డౌన్‌తో మండల తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిచిపోయాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. స్లాట్ బుక్ చేసుకున్న రైతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి సర్వర్ డౌన్‌తో నిరాశతో వెనుదిరుగుతున్నారు. తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ.. పోర్టల్ సాంకేతిక సమస్యతో అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇప్పటివరకు స్లాట్‌బుక్ చేసుకున్న వారందరికీ సర్వర్ సమస్య పరిష్కారం అయిన వెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు.
చేగుంట(తూప్రాన్): చేగుంట మోడల్ స్కూల్‌లో పదో తరగతిలో ఖాళీగా ఉన్న 5 సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ చంద్రకళ తెలిపారు. పదో తరగతితో పాటు ఇంటర్‌లో ఎంపీసీలో 15, ఏసీఈలో 20 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. సీట్ల భర్తీ కోసం ఈనెల 6లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, అర్హతలను బట్టి చేర్చుకుంటామని పేర్కొన్నారు.


