ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 14 కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో పురోగతిని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, పెండింగ్ కేసులు లేకుండా వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శివ్వంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడిందని తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసులను డీజీపీ అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ, డీఎస్పీలు పాల్గొన్నారు.


