విద్యాధరి.. అక్షర ఝరి | - | Sakshi
Sakshi News home page

విద్యాధరి.. అక్షర ఝరి

Jun 30 2026 4:44 PM | Updated on Jun 30 2026 4:44 PM

విద్యాధరి.. అక్షర ఝరి

వర్గల్‌(గజ్వేల్‌): మూల మహోత్సవ వేడుకలతో వర్గల్‌ విద్యాసరస్వతి క్షేత్రం అలరారింది. భక్తజన సామూహిక లక్ష పు ష్పార్చన, చిన్నారుల అక్షరాభ్యాసాలతో శోభిల్లింది. సోమవారం అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. చతుషష్ట్యోపచార పూజలు, సామూహిక లక్షపుష్పార్చన, చండీ హోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దివ్యమంగళ రూపం దర్శించుకుని తరించారు. అమ్మవారి జన్మనక్షత్రం మూల మహోత్సవ వేళ క్షేత్రంలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరిగాయి. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement