పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. సాయంత్రం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, ఉత్సవ విగ్రహాన్ని అలంకరించారు. అన ంతరం పల్లకీపై ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. గర్భగుడి నుంచి రాజగోపురం మీదుగా, గోకుల్‌షెడ్డు వరకు పల్లకీ సేవ కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: పోలీస్ నియామక నోటిఫికేషన్‌లో జిల్లాకు ఒక్క పోస్టు కూడా కేటాయించకపోవడం ఏమిటని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాల వారీగా రేషియో ప్రకారం పోలీస్‌శాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటిఫికేషన్‌లో 5 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీని 31 జిల్లాలకు మాత్రమే కేటాయించారని, అందులో మెదక్ జిల్లా పేరు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నోటిఫికేషన్ అధికారికమా..? కాదా అన్న విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలన్నారు. అంతకుముందు జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్‌చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చేనేత పరిశ్రమకు
నిధులివ్వండి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: దుర్భర పరిస్థితుల్లో ఉన్న చేనేత పరిశ్రమకు ప్రత్యేక నిధులు ఇచ్చి ప్రభుత్వం కాపాడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దుబ్బాక పట్టణంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన నీలకంఠ సమాజం దుకాణ సముదాయా న్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. చేనేత కార్మికులు సైతం ఇతర రంగాల వైపు దృష్టి సారించాలన్నారు. దుబ్బాక ప్రాంతం చేనేతకు చాలా ప్రసిద్ధి అని, ఇక్కడ నేతన్నలకు ఉపాధి కల్పించే మార్గాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. చేనేత కార్మికులు సంక్షేమం కోసం తాను శాయశక్తుల కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు, నీలకంఠ సమాజం అధ్యక్షులు తదితరులు ఉన్నారు.


