ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
రామాయంపేట(మెదక్): నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. తాను గెలుపొందిన తర్వాత గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, సాధ్యమైనంత మేర పరిష్కరించినట్లు చెప్పారు. పట్టణంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా బోరు, మోటార్లు మంజూరు చేశామని వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే తొనిగండ్ల గ్రామంలో మహి ళా మండలి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఒకటో వార్డులోని సమ్మక్క–సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ ప్రహరీకి భూమి పూజ నిర్వహించారు. స్థానిక హమాలీలకు బీమా పత్రాలు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు వార్డుల్లో నూతనంగా తవ్వించిన బోరు మోటార్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య, వైస్ చైర్‌పర్సన్ పొచమ్మల నవనీత, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రామకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.


