దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

పెద్దశంకరంపేట(మెదక్‌): పెద్దశంకరంపేటలో ని కేజీబీవీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ప్రారంభిస్తున్నామని ప్రిన్సిపాల్‌ విజయ తెలిపారు. ఇంటర్‌లో చేరడానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

256 కేంద్రాల్లో

Mö¯]l$-Vøâ¶æ$Ï ç³NÇ¢: MýSÌñæMýStÆŠḥæ

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో ఇప్పటివరకు 256 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 80,391 మంది రైతుల నుంచి 3,67,685,080 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

మద్యం అమ్మకాలపై నిషేధం

చేగుంట(తూప్రాన్‌): మద్య నిషేధంపై మండలంలోని బీ.కొండాపూర్‌ గ్రామ సభలో తీర్మానం చేశారు. మండలంలోని ఆరు గ్రామా ల్లో శనివారం ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించగా, బీ.కొండాపూర్‌లో సర్పంచ్‌ రాజిరెడ్డి ఆధ్యర్యంలో మద్య నిషేధంపై తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. అలాగే వడియారంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ పాల్గొని ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రత్యేక అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రకృతిని కాపాడుదాం..

పక్షులను రక్షిద్దాం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ప్రకృతిని కాపాడి పక్షులను రక్షించుకుందామని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శనివారం మండల పరిధిలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా అటవీ వారోత్సవాలను నిర్వహించారు. ఈసందర్భంగా పోచారం అభయారణ్యంలో బర్డ్‌వాక్‌ను డీఎఫ్‌ఓ జోజీతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే బర్డ్‌వాక్‌ కార్యక్రమం చేపట్టామన్నారు. పో చారం విభిన్న పక్షి జీవనానికి ప్రసిద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్లు, వాచర్లు పాల్గొన్నారు.

బ్యాంకర్ల పాత్ర కీలకం

మెదక్‌ కలెక్టరేట్‌: ఆర్థికాభివృద్ధిలో జిల్లా దూసుకెళ్తుందని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 5,607.28 కోట్ల రుణాలు పంపిణీ చేసి, లక్ష్య సాధనలో 85.05 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు అందడంలో బ్యాంకర్ల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. రుణాల పంపిణీలో రైతులు, మహిళా సంఘాలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. లక్ష్య సాధనలో మిగితా పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో ఆర్‌బీఐ ప్రతినిధి శ్రీనివాస్‌, ఎల్‌డీఎం బాపూజీ, నాబార్డ్‌ డీడీఎం కృష్ణ చైతన్య, వివిధ బ్యాంకుల ఏజీఎంలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement