కౌడిపల్లి(నర్సాపూర్)/కొల్చారం: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని ఆగ్రహ ం వ్యక్తం చేస్తూ శనివారం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని తునికి గేట్ వద్ద 765డీ హైవేపై తునికి దేవులతండా రైతులు రాస్తారోకో చేశారు. లారీలు రాకపోవడంతో ధాన్యం పేరుకుపోయిందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు వర్షాకాలం ప్రారంభం అవుతుంటే ధాన్యం సేకరణ ఎప్పుడు పూర్తి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలియడంతో ఎస్‌ఐ అమరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. అలాగే కొల్చారం మండలం చిన్నఘనాపూర్‌కు చెందిన రైతులు మెదక్–జోగిపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు.


