ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
చిన్నశంకరంపేట(మెదక్): పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడబిడ్డ పెళ్లికి అసరాగా నిలిచిచేందుకు రూ. 1 లక్ష అందజేస్తున్నట్లు తెలిపా రు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సన్నబియ్యం అందించడం ద్వారా పేదలకు మేలు చేశామన్నారు. గత పదేళ్లలో ఎక్కడా ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని, ప్రజా ప్రభుత్వంలో ఊరూరా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మండలంలోని కొర్విపల్లి, టీ.మాందాపూర్, ప్యాటగడ్డలో ఎంఎస్‌ఎస్‌ఓ ద్వారా సొంత నిధుల తో వేసిన బోరు మోటర్లను ఎమ్మెల్యే ప్రారంభించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌నాయక్, రమణ, రాజిరెడ్డి, సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


