ఎస్పీ శ్రీనివాస్‌రావు
పాపన్నపేట(మెదక్): పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు బాల పంచాయతీలను ఏర్పా టు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అందజేయడం మన బాధ్యత అన్నారు. బాలల ఆలోచనలు, అభిప్రాయాలు సమాజ అభివృద్ధికి తోడ్పడుతాయని చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు, సామాజిక స్పృహను అలవర్చుకోవాలని సూచించారు. విద్యతో పాటు సామాజిక వికాసం కూడా ముఖ్యమన్నారు. బాల్య వివాహాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, నిరక్షరాస్యత, బాల కార్మిక చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీడబ్ల్యూఓ ఉప్పలయ్య, సర్పంచ్ పావని, ఎస్సై శ్రీనివాస్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.


