జొన్నల కొనుగోళ్లు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

జొన్నల కొనుగోళ్లు వేగవంతం

Jun 6 2026 9:19 AM | Updated on Jun 6 2026 9:19 AM

జొన్నల కొనుగోళ్లు వేగవంతం నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం 12న స్పాట్‌ కౌన్సెలింగ్‌ జిల్లా రవాణా అధికారిగా శ్రీకాంత్‌ చక్రవర్తి ముగిసిన డైట్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలన పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

రామాయంపేట(మెదక్‌): జొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో కొనసాగుతున్న జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. రైతులు నాణ్యతగా ఉన్న జొన్నలను మాత్రమే కేంద్రాలకు తరలించాలని సూచించారు. నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించారు. అనంతరం ధా న్యం కొనుగోళ్లకు సంబంధించి రైస్‌ మిల్లులను సందర్శించారు. వెంటనే అన్‌లోడింగ్‌ చేసు కోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ రజని, ఇతర అధికారులు ఉన్నారు.

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): శీలాంపల్లి, గంగారం, చిట్కుల్‌ సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాకేశ్‌ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

నర్సాపూర్‌: నర్సాపూర్‌లోని అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కాలేజీలో ఈనెల 12న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రీజనల్‌ కోఆర్డినేటర్‌ గంగరాంనాయక్‌ తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్‌ చేపడుతున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

మెదక్‌జోన్‌: జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీకాంత్‌ చక్రవర్తి శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన కరీంనగర్‌ నుంచి బదిలీపై వచ్చారు. ఇక్కడ చాలా కాలంగా పని చేసిన వెంకటస్వామి ఖమ్మం జిల్లా వైరాకు బదిలీ అయ్యారు.

హవేళిఘణాపూర్‌(మెదక్‌): ఈనెల 2 నుంచి హవేళిఘణాపూర్‌ డైట్‌ కళాశాలలో ప్రారంభమైన ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. చివరి రోజు అధిక శాతం మంది విద్యార్థులు తరలివచ్చారు. మొత్తం 1,089 మంది అభ్యర్థులకు గానూ 1,208 మంది ధ్రువపత్రాలతో హాజరైనట్లు డైట్‌ ప్రిన్సిపాల్‌ రాధాకిషన్‌ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సుభాశ్‌రెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కనాటి సంరక్షించాలని మె దక్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని మల్లం చెరువు వద్ద మొక్కలు నా టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. మెదక్‌ను హరితవనంలా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కమిషనర్‌ నవీన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement