తడిసిన ధాన్యం వెంటనే కొనాలి | - | Sakshi
Sakshi News home page

తడిసిన ధాన్యం వెంటనే కొనాలి

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

నిజాంపేట(మెదక్‌): భారీ వర్షాలకు తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని నందిగామ శివారు రాయిలాపూర్‌ గేటు వద్ద హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర అందోళనకు గురవుతున్నారని తెలిపారు. మరో రెండు రోజుల్లో మృగశిర కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లారీలు, కూలీల కొరతతో ధాన్యం తరలింపు నిలిచిపోయిందని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాయలపూర్‌లో తడిసిన ధాన్యాన్ని కొను గోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పెద్దఎత్తున అందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రా మాయంపేట సొసైటీ చైర్మన్‌ బాదే చంద్రం, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, నిజాంపేట సీనియర్‌ నాయకులు సంపత్‌, సుప్రభాతరావు, మాజీ సర్పంచ్‌ నర్సాగౌడ్‌, సత్యం, భిక్షపతి, ఉమామహేశ్వర్‌, అబ్దుల్‌ అజిజ్‌, హస్నొద్దీన్‌, నవీన్‌, మధుకర్‌, శ్రావణ్‌, మహేశ్‌ రంజిత్‌ గౌడ్‌, శ్రీకాంత్‌గౌడ్‌, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement