ఎంపీ రఘునందన్‌రావు
మెదక్‌జోన్: జన్మనిచ్చిన తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్క నాటి పరిరక్షించాలని ఎంపీ రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు, ప్రజలు, తప్పనిసరిగా ‘ఏక్ పెడ్ మాకే నామ్ పే’లో భాగంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. పర్యావరణ సమతుల్యత కోసం త్వరలోనే మెదక్– ఎల్కతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రజిత్‌రెడ్డి, సురేశ్, నాయకులు శంకర్‌గౌడ్, నాగరాజు, రాగి రాములు, నాయిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


