సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని వెంకటాపూర్(ఆర్)లో ఎంపీడీఓ శ్రీనివాస్ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం నిర్వహించారు. గ్రామానికి చెందిన మమతకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్త యింది. దీంతో సోమవారం ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావ్, సర్పంచ్ లక్ష్మి, ఉపసర్పంచ్ మౌనిక, మమత గ్రామస్తులతో కలిసి గృహ ప్రవేశం చేశారు.
కోనాయిపల్లి(పీటీ)లో...
తూప్రాన్: ప్రభుత్వం పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్లతో నెరవేరిందని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మనోహరాబాద్ మండలంలోని కోనాయిపల్లి(పీటీ)లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పని చేసి పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ కృష్ణమూర్తి, సర్పంచ్ మన్నె కళ్యాణ్, గ్రామస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, తూప్రాన్ మండలంలోని కోనాయిపల్లి(పీబీ)గ్రామంలో మూ డు ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓ సతీష్, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డిలు ప్రారంభించారు.
రేగోడ్(మెదక్): పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.దిగంబర్‌రావు అన్నారు. మండలంలోని సంగమేశ్వర తండాలో లబ్ధిదారు వందన నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎంపీడీఓ సీతారావమ్మ, సర్పంచ్ సక్కూబాయితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయా ంలో ఒక్క ఇట్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు పీర్యానాయక్, హౌసింగ్ ఏఈ ప్రియ తదితరులు పాల్గొన్నారు.
కౌడిపల్లి మండలంలో..
చిన్నశంకరంపేట మండలంలో..
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఎంపీడీఓ దామోదర్, హౌజింగ్ డీఈ యాదగిరి ప్రారంభించారు. సోమవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ పథకాల అమలు కార్యక్రమం నిర్వహించారు. రుద్రారంలో ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారు హేమలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కళ నెరవేరిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంతోష, ఉపసర్పంచ్ నర్సింహులు, ఏఈ లోకేష్, కాంగ్రెస్ నాయకులు నవీన్‌కుమార్ పాల్గొన్నారు.