నారీమణులే నిర్ణేతలు
● మున్సిపల్ ఎన్నికల్లో వీరే కీలకం
● గెలుపోటములపై తీవ్ర ప్రభావం
● మహిళా ఓటర్లపైనే పార్టీల దృష్టి
మున్సిపాలిటీల్లో ఓటర్ల వివరాలు
మున్సిపాలిటీ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు
మెదక్ 17,548 19,406 1 36,954
రామాయంపేట 6,291 6,804 - 13,095
నర్సాపూర్ 8,219 8,656 1 16,876
తూప్రాన్ 9,957 10,302 - 20,259
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపాలిటీలోని బీఆర్‌ఎస్ నాయకులందరూ ఐక్యంగా పని చేసి చైర్మన్ పదవిని దక్కించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన పార్టీ నాయకులు హైదరాబాద్‌లో మంగళవారం హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నర్సాపూర్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు చెప్పి ఓటు అడగాలన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా సహించేదిలేదని హెచ్చరించారు. పార్టీ చేయించే సర్వేలో ప్రజల్లో పట్టున్న వారికే టికెట్‌లు ఇస్తామని, పోటీచేయాలనుకుని అవకాశం దక్కని నాయకులు నిరుత్సాహపడవద్దని సూచించారు. పార్టీ కోసం పని చేయాలని అటువంటివారికి భవిష్యత్తులో తగిన గుర్తింపునిస్తుందని స్పష్టం చేశారు. హరీశ్‌రావును కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ నయిమోద్దీన్‌తోపాటు పలువురు నాయకులు ఉన్నారు.
రామాయంపేట (మెదక్): జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. ఈ మున్సిపాలిటీల్లో పురుషుల ఓట్ల కంటే మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళల ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఆయా పార్టీల నాయకులు మహిళా ఓటర్లపై దృష్టి సారించారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 87,185 ఓట్లకు గాను, పురుషులు 42,015 కాగా, మహిళలు 45,168, ఇతరులు ఇద్దరు ఉన్నారు. మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,153 మంది అధికంగా ఉన్నారు. కౌన్సిలర్లుగా పోటీ చేసేవారు ముందుగా మహిళా ఓటర్లనే ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఆశావహులు ఇప్పటి నుంచే మహిళా సంఘాల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ మహిళల శ్రేయస్సుకు అఽధిక ప్రాధాన్యత ఇస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మెదక్ మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళలు 18,48 మంది, తూప్రాన్‌లో 345 మంది, నర్సాపూర్‌లో 437 మంది, రామాయంపేటలో 513 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో మున్సిపాలిటీల్లో మహిళల ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మెప్మా గ్రూపు సభ్యులపై నమ్మకం పెట్టుకున్నారు. ఇటీవల ఈ గ్రూపులకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేయడంతో వారి మద్దతు తమకే ఉంటుందని అంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న మహిళా గ్రూపుల సభ్యులు అధికార పార్టీని ఆదరిస్తారని వారు భావిస్తున్నారు. మెదక్‌లో 7,975 మంది, తూప్రాన్‌లో 4,199, నర్సాపూర్‌లో 2,967, రామాయంపేటలో 3,339 మంది మెప్మా గ్రూపులో మహిళా సభ్యులున్నారు.
హరీశ్‌రావును కలిసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి, పార్టీ నాయకులు


