
చాకరిమెట్లలో శ్రావణ సందడి
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శనివారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ప్రధాన అర్చకుడు దేవాదత్తశర్మ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.
చెరువుల వద్దకు వెళ్లొద్దు
ఎస్పీ శ్రీనివాస్‌రావు
నర్సాపూర్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం రాయరావు చెరువును పరిశీలించి మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చెరువులు, నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 8712656739 నంబర్‌లో సంప్రదించాలన్నారు. కాగా రాయరావు చెరువు వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి చెప్పారు. ఆయన వెంట సీఐ జాన్‌రెడ్డి, ఎస్‌ఐ లింగం ఉన్నారు.
నిల్వ నీటిని తొలగించాలి
డీఏఓ దేవ్‌కుమార్
రామాయంపేట(మెదక్): భారీ వర్షాలతో పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండటంతో రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పంట చేనులో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలన్నారు. కొన్ని మండలాల్లో మొక్కజొన్న, పత్తి చేనులో నీరు నిలిచినట్లు తెలిసిందని, నీటిని తొలగించకపోతే పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు ఎరువులు, క్రిమి సంహారక మందులు చల్లవద్దన్నారు. వర్షాలతో జిల్లాలో ఎక్కడా పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు. ఈమేరకు అన్ని మండలాల్లో వ్యవసాయ అధి కారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తూ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా పంటలు దెబ్బతింటే తమకు సమాచారం అందజేయాలని కోరారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శంకర్‌గౌడ్
రామాయంపేట(మెదక్): బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేటకు చెందిన శంకర్‌గౌడ్ నియామకం అయ్యారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ శనివారం నియామకపత్రం అందజేశారు. ఎంపీ రఘునందన్‌రా వు, జిల్లా అధ్యక్షుడి సహకారంతో తనకు పదవి వరించిందని, పార్టీ నాయకులు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శంకర్‌గౌడ్ హామీ ఇచ్చారు.
అధికారులుఅందుబాటులో ఉండాలి
పెద్దశంకరంపేట(మెదక్)/టేక్మాల్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ, పంచాయతీరాజ్, గ్రామ కార్యదర్శులతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా వైద్య సిబ్బందితో కలిసి అవగాహన కల్పించాలని సూచించారు. చెరువులు, కుంటల వద్ద రైతులకు జాగ్రత్తలపై వివరించాలని సూచించారు. అనంతరం టేక్మాల్ మండలంలో పర్యటించారు. పూర్తిగా వర్షాలు తగ్గే వరకు గుండువాగుపై నుంచి రాకపోకలను నిలిపివేయాలన్నారు. ఆయన వెంట ఇతర అధికారులు ఉన్నారు.

చాకరిమెట్లలో శ్రావణ సందడి

చాకరిమెట్లలో శ్రావణ సందడి

చాకరిమెట్లలో శ్రావణ సందడి