
క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి
డీఈఓ రాధాకిషన్
వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం డీఈఓ రాధాకిషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రార్థనా సమయానికి ముందే పాఠశాలకు చేరుకొని పరిసరాలు పరిశీలించారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న ఎంఈఓ యాదగిరిని సత్కరించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో విద్య నభ్యసించాలని సూచించారు. పాఠ్యాంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే వెంటనే సంబంధిత ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకోవాలన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు వస్తుందనడానికి ఎంఈఓ యాదగిరి నిదర్శనమన్నారు. అటాంటి వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నతంగా రాణించాలని సూచించా రు. కార్యక్రమంలో హెచ్‌ఎం సాంబయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.