
ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి
అల్లాదుర్గం(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గడిపెద్దాపూర్, ముస్లాపూర్‌లో నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి పిల్లర్లు అవసరం లేద న్నారు. 600 గజాలలోపు మాత్రమే కట్టుకునేలా చూడాలని హౌసింగ్ అధికారులను అదేశించారు. అనంతరం గడిపెద్దాపూర్‌లో ఫర్టిలైజర్ షాపు, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వసతులు, రోగు లకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఇదిలాఉండగా గ్రామంలో క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని యువకులు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ జరపాలని అల్లాదుర్గం తహసీల్దార్‌ను కలెక్టర్ అదేశించారు. అలాగే ముస్లాపూర్ పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. డాక్టర్ సక్రమంగా విధులకు రావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండటంపై కార్యదర్శిపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని అదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీఓ సుధాకర్, ఎంపీఓ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్