
లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన
నర్సాపూర్ రూరల్: లింగ వివక్షతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని చిన్నచింతకుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు (జెండర్) లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే లింగ వివక్షత లేకుండా పోతుందన్నారు. ప్రస్తుత పిల్లలకు కుటుంబ పెద్దలను గౌరవించడం, అన్యోన్యంగా ఉండే విధానాన్ని అలవర్చాలని సూచించారు. కార్యక్రమంలో జెండర్ సెంట్రల్ టీం సభ్యులు నసీం, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సరస్వతి, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ల సరిత, లింగంగౌడ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్ సిబ్బంది పాల్గొన్నారు.