దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన తూప్రాన్ మున్సిపాలిటీ సమస్యలతో సతమతమవుతోంది. మౌలిక వసతులు కొరవడి ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు కరువయ్యాయి. కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనమిస్తోంది. రోడ్లపై మురుగు నీరు పారి దుర్వాసన వెదజల్లుతోంది. తాగునీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యంగా మారింది. – తూప్రాన్
తూప్రాన్ మున్సిపాలిటీలోమౌలిక వసతులు కరువు
● ‘సాక్షి’ పరిశీలనలోవెలుగుచూసిన వాస్తవాలు
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025
దశలవారీగా పరిష్కరిస్తాం
తూప్రాన్ మున్సిపాలిటీలో సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. పెండింగ్‌లో ఉన్న పనులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తాం. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరం ఉన్న కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం.
– గణేష్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్
అరకొరగా తాగునీటి సరఫరా
కాలనీల్లో మిషన్ భగీరథ ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. కానీ అవి అందరికి సరిపోవడం లేదు. ఇప్పటికై నా నల్లాల ద్వారా తాగు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి.
– ఉపేందర్, తూప్రాన్
వృథాగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్
పట్టణ ప్రజలకు దూరంగా నర్సాపూర్ చౌరస్తా సమీపంలోని ప్రభుత్వ స్థలంలో రూ. 11 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించిన రెండు, మూడు నెలల పాటు క్రయవిక్రయాలు సజావుగా సాగాయి. అయితే మార్కెట్ దూరంగా ఉండడంతో సరుకులు, కూరగాయలు, చేపలు, మాంసం కొనేందుకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో ప్రజలు, వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చి తిరిగి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే వ్యాపారులు దుకాణాలను కొనసాగిస్తున్నారు.
రహదారిపైనే చిరు వ్యాపారం
పట్టణ సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారి పక్కన చిరువ్యాపారుల సౌకర్యార్థం గత ప్రభుత్వం వే సైడ్ మార్కెట్‌ను రూ. 2.50 కోట్ల వ్యయంతో నిర్మించింది. అక్కడ వ్యాపారం సరిగా సాగక తిరిగి వ్యాపారులు రహదారి పక్కనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఫలితంగా రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన మార్కెట్ నేడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.
వ్యవసాయ మార్కెట్ అలంకారప్రాయం
రైతుల సౌకార్యార్థం వ్యవసాయ మార్కెట్‌ను టోల్ ప్లాజా పక్కన సుమారు 22 ఎకరాల్లో రూ. 6 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా గోడౌన్లు నిర్మించారు. కాని ఏర్పాటు చేసి నాలుగేళ్ల గడుస్తున్నా నేటికీ నూతన మార్కెట్ కమిటీని నియమించలేదు. రహదారి పక్కన అలంకారప్రాయంగా దర్శనమిస్తుంది. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
అసంపూర్తిగా సమీకృత భవనం
మండలంలోని ప్రభుత్వ కార్యాయాలను ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు గత ప్రభుత్వం రూ. 8 కోట్లతో సమీకృత భవన నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం ఎంఈఓ, ఐకేపీ, ఈజీఎస్, భవనాలను కూల్చివేసి ఆ స్థలంలో నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 80 శాతం మేర పనులు పూర్తి కాగా, మిగితా 20 శాతం పనులు నిధుల కొరతో నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇరుకు గదుల్లో ఐకేపీ, ఎంఈఓ, తహసీల్దార్, వ్యవసాయ, ఆర్డీఓ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
జాడలేని సేంద్రియ ఎరువు
నాలుగు విలీన పంచాయతీలతో కలిపి నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో సిబ్బంది నిత్యం 10 మెట్రిక్ టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను పట్టణ సమీపంలోని టాటా పరిశ్రమ వెనకాల గుట్టల్లో డంప్ చేస్తున్నారు. చెత్తతో (కంపోస్టు) సేంద్రియ ఎరువు తయారు చేస్తామని లక్షలు ఖర్చు చేశారు. కానీ ఇప్పటివరకు సేంద్రియ ఎరువు తయారీ ఊసే లేదు. సేకరించిన చెత్తను కాల్చివేసి బుగ్గిపాలు చేస్తున్నారు. ఫలితంగా చెత్త నుంచి వచ్చిన పొగతో సమీప గ్రామాలు, రావెల్లి, వెంకటాపూర్ గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.
న్యూస్‌రీల్
నిలిచిన సుందరీకరణ పనులు
పట్టణ సమీపంలోని పెద్ద చెరువు కట్టను మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ. 9 కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు విస్తరణ పనులు చేపట్టారు. అదనంగా మరో రూ. 75 లక్షలతో సుందరీకరణ కోసం చెరువు కట్టపై వాకింగ్ ట్రాక్, పార్కు, చెరువులో బోటు సదుపాయం, తదితర మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చెరువు కట్ట విస్తరణ పనులు చేపట్టారు కానీ సుందరీకరణ చేయలేదు. చెరువులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గతంలో రెండు నెలల పాటు రెండు బోట్లు ఏర్పాటు చేశారు. అనంతరం వాటి వినియోగం భారంగా మారడంతో ఆపేశారు.
తూప్రాన్ మున్సిపల్ స్వరూపం
జనాభా 21,148
వార్డులు 16
రెవెన్యూ వార్డులు 18
ఇళ్లు 6,605
అవసరమైన తాగునీరు 3.60 ఎంఎల్‌డీ
చెత్త సేకరణ వాహనాలు 10 ఆటోలు, 3 ట్రాక్టర్లు
పబ్లిక్ టాయిలెట్లు 05
స్వయం సహాయక సంఘాలు 395
వీధి వ్యాపారులు 946 మంది
కొందరికే డబుల్ బెడ్రూంలు
మున్సిపల్ కేంద్రంలో 2018లో రూ.25 కోట్ల నిధులతో 504 ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇందులో కేవలం 422 ఇళ్లను మాత్రమే పూర్తి చేశారు. మిగితావి సగం పనులు జరగగా, మరికొన్ని ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లబ్ధిదారులను లక్కీ డ్రా పద్ధతిలో ఎంపిక చేసి ఇళ్లు అప్పగించారు. అసంపూర్తిగా వదిలేసిన వాటిని సైతం కొందరికీ కేటాయించారు. దీంతో చేసేదేలేక అప్ప చేసి నిర్మాణాలు పూర్తిచేసుకున్నారు. మరికొందరు అలాగే వదిలేశారు.
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ
దొడ్డు బియ్యం మాటేంది? రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొ


