సంతోషంగా ఉంది
మాది ధంజ్యా తండా, బస్సు సౌకర్యం లేదు. అయినా చదువుకోవాలన్న తపనతో ప్రతి రోజు కాలినడకన 5 కి.మీ నడిచి పాపన్న పేట ఉన్నత పాఠశాలకు వస్తాం. గిరిజన కుటుంబంలో పుట్టిన మాకు షూలు, టైలు, స్పోర్ట్స్ డ్రెస్‌లు తెలియవు. ఇవన్నీ ఉన్న ప్రైవేట్ విద్యార్థులను చూస్తే, కొంచెం బాధగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ కిట్లు ఇవ్వడం సంతోషకరం.
– పూజిత, పదో తరగతి, పాపన్నపేట
సర్కార్ బడులు బలోపేతం
ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థులకు కిట్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతుండటం సంతోషకరం. ఇంకా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
– విజయ, డీఈఓ
సంతోషంగా ఉంది


