దశలవారీగా సమస్యల పరిష్కారం
నర్సాపూర్ రూరల్: దశలవారీగా విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నా రాయణనాయక్, డీఈ రామేశ్వరస్వామి అన్నారు. శనివారం నర్సాపూర్ విద్యుత్‌శాఖ ఏడీ రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని లింగాపూర్‌లో జరిగిన ప్రజా బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. లో ఓల్టేజీ, వేలాడుతున్న తీగలు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త విద్యుత్ లైన్ల గురించి ప్రజా బాట ద్వారా తెలుసుకొని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. అత్యవసర సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులు సొంతంగా కరెంట్ మరమ్మతులు చేసుకోవద్దని సూచించారు. సమస్యలు ఉంటే తమ సిబ్బందికి తెలపాలన్నారు. వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్తా, ఏఈ రామ్మూర్తి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ ఎస్‌ఈ నారాయణనాయక్


