కాంగ్రెస్‌ను నిలదీయండి
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో రెండో రోజు పర్యటించి కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలకు పంపిణీ చేశారు. పెంచిన పింఛన్ వస్తుందా, తులం బంగారం ఇస్తున్నారా..? అంటూ ఆరా తీశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు శివకుమార్, అశోక్‌గౌడ్, నయీమోద్దీన్, సత్యంగౌడ్, భిక్షపతి, బాల్‌రెడ్డి, రాకేశ్‌గౌడ్, నాగరాజుగౌడ్, /్ఞానేశ్వర్, లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జంతు గణనపై శిక్షణ
రామాయంపేట(మెదక్): అటవీప్రాంతంలో ఈనెల 19 నుంచి చేపట్టనున్న జంతు గణనలో ఆశాఖ అధికారులతో పాటు విద్యార్థులు పాల్గొ నన్నారు. ఈమేరకు విద్యార్థులకు పలుమార్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. తాజాగా శనివారం మండలంలోని అక్కన్నపేట అటవీప్రాంతంలో స్థానిక చత్రపతి శివాజీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ప్రైవేట్ వ్యక్తికి తోడుగా తమ శాఖకు చెందిన వ్యక్తి ఉంటారని, వారిద్దరు కలిసి జంతు గణన చేపట్టి వెంటనే ఆన్‌లైన్ చేయాల్సి ఉంటుందని అటవీశాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. సర్వేలో భాగంగా ప్రతి రోజూ కనీసం నాలుగు కిలో మీటర్లు అటవీలో పర్యటించాల్సి ఉంటుందన్నారు. సాఫీగా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
కుంటలు కబ్జా చేస్తే
కఠిన చర్యలు తప్పవు
మనోహరాబాద్(తూప్రాన్): గ్రామాల్లో కుంటలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇరిగేషన్ ఏఈ విజయ్‌కుమార్, రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. శనివారం మండలంలోని చెట్లగౌరారం గ్రామస్తులు మాక్సోని కుంట కబ్జా చేస్తున్నారని అధికారులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ ఏఈ విజయ్‌కుమార్, మండల రెవెన్యూ అధికారులు కుంటను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని ప్రతి కుంట, చెరువు భూములను సర్వే చేసిన హైడ్రా ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు తెలిపారు. కుంట శిఖం, బఫర్ జోన్‌లను అందులో ఉంచామన్నారు. ఎవరు ఎలాంటి కబ్జా చేసిన వెంటనే తెలిసిపోతుందన్నారు. కుంటలు, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వారి వెంట నాయకుడు శ్రీహరిగౌడ్, గ్రామస్తులు ఉన్నారు.
కాంగ్రెస్‌ను నిలదీయండి
కాంగ్రెస్‌ను నిలదీయండి


