‘పుర’ రిజర్వేషన్లు ఇలా..
మెదక్ కలెక్టరేట్: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు చెందిన వార్డుల రిజర్వేషన్ ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రిజర్వేషన్‌పై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని మెదక్ మున్సిపాలిటీ 32 వార్డులు, నర్సాపూర్ 15, తూప్రాన్ 16, రామాయంపేట 12 వార్డులకు రిజర్వేషన్లు ప్రకటించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, ప్రత్యేక అధికారి సంధ్య, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ
వార్డు రిజర్వేషన్
1, 13 ఎస్సీ మహిళ
2 ఎస్టీ జనరల్
8,11, 12, 21 బీసీ మహిళ
7, 15, 16,20, 24, 25, 29 బీసీ జనరల్
3, 4, 10, 14, 17, 23, 27, 28, 32 జనరల్ మహిళ
18, 26 ఎస్సీ జనరల్
5, 6, 9, 19, 22, 30, 31 అన్ రిజర్వ్‌డ్ జనరల్


