ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అవగాహన

Mar 22 2025 9:07 AM | Updated on Mar 22 2025 9:07 AM

ఒకే ద

ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అవగాహన

నర్సాపూర్‌: ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానంతో దేశానికి చాలా మేలు జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలుమార్లు ఎన్నికలు నిర్వహించడంతో దేశంపై ఆర్థిక భారం పడడంతో పాటు సమయం వృథా అవుతుందన్నారు. వాటిని తగ్గించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం తేవడానికి కృషి చేస్తున్నారని వివరించారు. సమావేశంలో బీజేపీ నాయకులు రమేష్‌గౌడ్‌, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌, కాలేజీ ప్రిన్సిపాల్‌ అశోక్‌ పాల్గొన్నారు.

‘నాసిరకం పనులపై

చర్యలు చేపట్టాలి’

పెద్దశంకరంపేట(మెదక్‌): పెద్దశంకరంపేటలో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు చేపట్టిన సీసీ రోడ్డు పనులు నాసిరకంగా ఉన్నాయని, ఆర్‌అండ్‌బీ జిల్లా అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ. 80 లక్షలతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల పనులు సరిగా చేయకపోవడంతో సీసీ రోడ్డు కుంగిపోయిందన్నారు. అయినప్పటికీ సంబంధిత అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పెద్దశంకరంపేటలోని అన్ని వార్డుల్లో రహదారి పనుల వల్ల మిషన్‌ భగీరథ పైపులైన్‌ దెబ్బతిందన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. వెంటనే పైపులైన్‌కు మరమ్మతులు చేయింది ప్రజలకు తాగునీటిని అందించాలని డిమాండ్‌ చేశారు.

మోసాలకు పాల్పడితే

కఠిన చర్యలు

పాపన్నపేట(మెదక్‌): రేషన్‌ దుకాణాల్లో మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికలు, కొలతల అధికారి సుధాకర్‌ హెచ్చరించారు. శుక్రవారం పాపన్నపేట, టేక్మాల్‌ మండలాల్లోని పలు రేషన్‌ దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా తూకం యంత్రాలను పరిశీలించారు. తూకంలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాపన్నపేటలో 30, టేక్మాల్‌లో 20 తూకం యంత్రాలకు స్టాంపింగ్‌ వేసినట్లు చెప్పారు. వ్యాపారులు తప్పనిసరిగా తూకం నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట రేషన్‌ డీలర్లు ఉన్నారు.

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ప్రజలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్‌ సూచించారు. శుక్రవారం మండలంలోని కొండాపూర్‌లో రెడ్‌క్రాస్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వీఎస్టీ పరిశ్రమ సహకారంతో మల్లారెడ్డి ఆస్పత్రి సిబ్బంది ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి, జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సభ్యులు సింగం శ్రీనివాస్‌రావు, పీహెచ్‌సీ వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

ఒకే దేశం..  ఒకే ఎన్నికపై అవగాహన 
1
1/1

ఒకే దేశం.. ఒకే ఎన్నికపై అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement