దండేపల్లి: మండలంలోని తాళ్లపేట గ్రామాన్ని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ సోమవారం సందర్శించారు. గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఆదివారం అర్ధరాత్రి జరిగిన వివాదంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సోమవారం రాత్రి డీసీపీ ఏసీపీ ప్రకాష్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించారు. బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా దండేపల్లి పోలీస్టేషన్‌ను సందర్శించి తాళ్లపేట ఘటనపై ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారి వెంట సీఐ రమణమూర్తి, ఎస్సై రాజవర్ధన్ ఉన్నారు.


