మంచిర్యాలఅర్బన్: స్థానిక విశ్వనాథ ఆలయ కాలక్షేప మండపంలో సోమవారం సర్వజననీ దుర్గా అష్టమి పూజ సందర్భంగా అమ్మవారికి 108 తామర పువ్వులు, తొమ్మిది కలశాలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఎదుట 108 దీపాలు వెలిగించారు. అంతకుముందు దుర్గామాతను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, అసిస్టెంటు ట్రెజరీ ఆఫీసర్ పంకజ్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ క్రాంతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 2027 సంవత్సరం దుర్గామాత క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో దుర్గాపూజ కమిటీ అధ్యక్షుడు ధర్మేందర్, కార్యదర్శి సైదం లక్ష్మీనారాయణ, సభ్యులు రీనారాణిదాస్, అత్తి సరోజ, రాజేందర్, సుధీర్ తదిరతరులు పాల్గొన్నారు.


