శమీ పూజకు ప్రాచీన చరిత్ర | - | Sakshi
Sakshi News home page

శమీ పూజకు ప్రాచీన చరిత్ర

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

చెన్నూర్‌: చెన్నూర్‌లో జరిగే దసరా పండుగకు ఎంతో ప్రాశస్త్యంతోపాటు ప్రత్యేకత ఉంది. కాశీ అంతటి పుణ్యనదిగా పేరొందిన పంచక్రోశ ఉత్తరవాహిని నది సమీపంలోని గోవరమ్మ ఆలయ ప్రాంగణంలో దసరా వేడుకలు, శమీ పూజ నిర్వహించడం రెండు శతాబ్దాలకు పైగా ఆనవాయితీగా వస్తోంది. కోటపల్లి మండలం కొత్తపల్లితోపా టు జైపూర్‌ మండలం శివ్వారం అటవీ ప్రాంతంలో పాండవ పుత్రుడు భీముడి అడుగులు ఉండడంతో ఈ ప్రాంతంలో పాండవులు సంచరించార ని చరిత్ర ద్వారా తెలుస్తోంది. పాండవులు కోటపల్లి నుంచి జైపూర్‌ మండలాలకు వెళ్లే క్రమంలో చెన్నూర్‌ మీదుగా వెళ్లారని, గోదావరి సమీపంలో ని గోవరమ్మ ఆలయం వద్ద సేదదీరి శమీ చెట్టుకు పూజలు చేశారని ప్రచారంలో ఉంది. కొన్నాళ్లకు శమీ చెట్టు అంతరిపోగా.. గోవరమ్మ ఆలయం వద్ద దసరా పండుగ రోజు వేదపండితులు శమీ చెట్టును ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వ స్తోంది. గత రెండు శతాబ్దాలపైగా నిర్వహిస్తున్న ఈ పూజలను అనాదిగా పట్వారీ విజిగిరి శ్రీనివా స్‌రావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆయన మృతి తర్వాత కుమారులు, ప్రస్తుతం మనుమలు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు.

భాజాభజంత్రీలతో..

ప్రతియేటా దసరా పండుగ రోజున గాంధీ చౌక్‌ నుంచి భాజాభజంత్రీల మధ్య గోవరమ్మ ఆల యం వరకు పట్టణ ప్రజలు, వివిధ పార్టీల నాయకులు, బ్రాహ్మణులు శోభాయాత్రగా వెళ్తారు. పండితులు శ్రీరాంభట్ట సత్యనారాయణ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి శమీని తీసుకొచ్చి పండుగు జరుపుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెద్దింటి పద్మ, కమిషనర్‌ మారుతి ప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement