సమస్యలు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

Oct 20 2026 4:31 AM | Updated on Oct 20 2026 4:31 AM

● జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు ● కన్నెపల్లి మండలం రెబ్బెన గ్రామంలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపాలని ఉపసర్పంచ్‌ అన్నారపు ప్రశాంత్‌ కోరారు. ● జైపూర్‌ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన పప్పు అనూష తాను ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పూర్తి చేశానని, తన భర్త, కొడుకు సికిల్‌ సెల్‌ వ్యాధితో బాధపడుతున్నారని, కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని, మానవతా దృక్పథంతో ఉపాధి కల్పించాలని అర్జీ సమర్పించారు. ● మంచిర్యాలకు చెందిన దగమ లక్ష్మి మంచిర్యాల మున్సిపల్‌ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, కానీ తనకు క్యాతనపల్లి మున్సిపల్‌ పరిధిలో భూమి ఉందని, ఇందిరమ్మ ఇంటిని క్యాతనపల్లి మున్సిపాలిటీకి బదిలీ చేయాలని దరఖాస్తు అందజేశారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాంతో కలిసి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను పరిశీలించి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 13 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: జీవో నంబరు 59 కింద పెండింగ్‌లో ఉన్న 4,282 దరఖాస్తులు, జీవో నంబరు 76 కింద పెండింగ్‌లో ఉన్న 727 దరఖాస్తులు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయా దరఖాస్తులపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తుల పరిశీలన, క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ, గ్రామ పంచాయతీ అధికారి సంబంధిత రికార్డులతో క్షేత్రస్థాయిలో 500గజాల్లోపు విస్తీర్ణంలో ఉన్న నిర్మాణ స్థలాలను పరిశీలించాలని, వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఫిర్యాదులను 9492123642 వాట్సాప్‌ నంబర్‌ ద్వారా స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 17వరకు వాట్సాప్‌ ద్వారా 110 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన పేదలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.

పరిష్కారం కాలేదు

భీమారం గ్రామంలో చిన్న ఇంటిని నిర్మించుకుని జీవిస్తున్నాం. 242 చదరుపు గజాల్లో ఇంటి ఇంటి క్రమబద్ధీకరణ కోసం జీవో 59 ద్వారా 30 మార్చి 2022 మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాను. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మళ్లీ ప్రభుత్వం పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చినా కావడం లేదు. అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన రీసీవుడు రసీదు మాత్రం ఇవ్వలేదు.

– కోట శ్రీరాములు, భీమారం

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు

కోటపల్లి మండలం మల్లంపే ట గ్రామ నిధుల దుర్వినియో గం, అవకతవకలపై విచారణ చేపట్టాలని కలెక్టరేట్‌లో ఇప్పటికి మూడు సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇది నాలుగోసారి ఫిర్యాదు చేయడం. 40 రోజుల నుంచి కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే ఇంకా ఎక్కడ ఫిర్యాదు చేయాలి.

– కొండ సుదర్శన్‌, మల్లంపేట, కోటపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement