అప్పు చేసి పంటలు సాగు చేసిన. చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. పందులు గుంపులుగా వచ్చి పామాయిల్ కాయలను తినేసి ధ్వంసం చేస్తున్నాయి. పత్తి చెట్లకు ఇప్పుడిప్పుడే కాయలు వస్తున్నాయి. వీటిని కూడా పందులు తినేసి, కొమ్మలను విరిచేసి వెళ్తున్నాయి. బీర, సోరకాయ ఇతర రకాల కూరగాయలు సాగు చేస్తే కోతులు దక్కనీయడం లేదు. పందులు, కోతుల సమస్యను ఏ తీరుగా అధిగమించాలో తెలియడం లేదు.
– సోమలింగం, రైతు, గ్రామం: చెర్లపల్లి,
మం: బెల్లంపల్లి


