పోలీసుస్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పోలీసుస్టేషన్‌ తనిఖీ

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

మందమర్రిరూరల్‌: మందమర్రి పోలీస్‌స్టేషన్‌ను రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా గురువారం డీసీపీ భాస్కర్‌తో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పెండింగ్‌ కేసులు దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్ల హిస్టరీ, హిస్టరీ షీటర్ల కదలికలు, నేర నియంత్రణపై చర్యలు, విజిబుల్‌ పోలిసింగ్‌, పెట్రోలింగ్‌ తదితర అంశాలపై ఎస్సై నరేష్‌ను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. మందమర్రి ప్రాంతంలో నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు సూచనలు చేశారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, నేర ర హిత పట్టణంగా తీర్చిదిద్దాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement