పాతమంచిర్యాల: సర్(ఎస్‌ఐఆర్)లో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్‌వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల విభాగం అధికారులతో ఎస్‌ఐఆర్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాపింగ్ కాని అనామలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీస్‌లకు సంబంధించి ఇళ్ల వద్దకు వెళ్లి ధ్రువపత్రాలు సేకరించాలని అన్నారు. నిర్ణీత గడువులోగా డిజిటలైజేషన్ పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరాం, ఆర్డీవో శ్రీనివాసరావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.


