జిల్లావ్యాప్తంగా జ్వరాలు, జలుబు, దగ్గు వంటివి ఎక్కువగా వస్తున్నాయి. డెంగీ కేసులు నమోదవుతన్న చోట వైద్య సిబ్బంది కేసులు పెరగకుండా నివారణ చర్యలు చేపడుతున్నారు. జ్వరాల బారిన పడ్డ వారి ఇళ్లకు వెళ్లి మందులు అందించడం, రక్తనమూనాలు సేకరించి టీహబ్‌కు పంపించి వ్యాధులు నిర్ధారిస్తున్నాం. అన్ని రకాల సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉంచాం. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.
– డాక్టర్ నరేందర్ రాథోడ్,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి


