పాతమంచిర్యాల: రక్తదానానికి ప్రజలు ముందుకు రావాలని, రక్తదానంపై అపోహాలు విడనాడాలని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో అవగాహనకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా 30 మంది రక్తదానం చేయగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రక్తనిధి కేంద్రం వైద్యులు ప్రేంసాయి, లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్టు కో ఆర్డినేటర్ ఫర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వి.మధుసూదన్‌రెడ్డి, లయన్స్ ఇంటర్నేషనల్ సెకండ్ వైస్ డిస్ట్రిక్టు గవర్నర్ డాక్టర్ ఉదారి చంద్రమోహన్‌గౌడ్, లయన్స్ క్లబ్ మంచిర్యాల శాఖ అధ్యక్షు డు వెంకటేశ్వర్లు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మహేందర్ పాల్గొన్నారు.


