తాంసి: భీంపూర్ మండలం టేకిడి రాంపూర్ గ్రా మానికి చెందిన ఆత్రం ధాంజీకి చెందిన ఇల్లు శని వారం రాత్రి దీపం మంటలు అంటుకొని దగ్ధమైంది. వివరా ల్లోకి వెళ్తే.. కు టుంబ సభ్యులు శనివారం సాయంత్రం దేవుని గది వద్ద దీపం వెలిగించి పూజలు చేశారు. అనంతరం దీపం అలాగే ఉంచి రాత్రి పక్కనున్న గదిలో నిద్రిస్తుండగా 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పూజ గదిలో మంటలు చెలరేగాయి. మంటలు ఇంట్లోని సామగ్రికి వ్యాపించగా చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యారు. నీళ్లు చల్లి మంట లు ఆర్పివేశారు. మంటల్లో ఇంట్లో ఉన్న రూ.3వేల నగదుతో పాటు పిల్లల సర్టిఫికెట్స్, బట్టలు, వంట సామగ్రి కాలిపోయాయి. దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వాపోయారు. గ్రామ సర్పంచ్ సిడాం కేశవ్, గ్రామ పెద్దలతో కలిసి కాలిపోయిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబానికి నిత్యావసర సామగ్రి అందజేశారు.


