అద్దె భవనాల్లో అవస్థలు | - | Sakshi
Sakshi News home page

అద్దె భవనాల్లో అవస్థలు

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

ఉమ్మడి జిల్లాలో 26 గురుకులాలు మూడింటికే సొంత భవనాలు ఇరుకై న గదుల్లో విద్యార్థుల ఇక్కట్లు పట్టించుకోని ప్రభుత్వం

ఆదిలాబాద్‌రూరల్‌: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలను సమస్యలు వెంటాడుతున్నాయి. ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017లో వీటిని ప్రారంభించింది. అప్పటి నుంచి చాలా వరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఓ వైపు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆదరణ ఉండడంతో పాఠశాలలను కళాశాలలుగా కూడా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేస్తున్నా సొంత భవనాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.

పట్టించుకోని ప్రభుత్వం

జిల్లాలో గురుకుల పాఠశాలలు, కళాశాలలకు అంతంత మాత్రంగానే అద్దె చెల్లిస్తుండడంతో విద్యార్థులకు సరిపడా భవనాలు లభ్యం కావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దెతో ఇరుకై న భవనాలు అద్దెకు తీసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల శంఖుస్థాపనలు చేసిన వాటి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నారు.

ప్రహరీ కరువు..

జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 44కు ఆనుకొని 2016లో మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల బాలికల పాఠశాల, కళాశాలను నిర్మించారు. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం 800 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. కానీ ప్రహరీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాలికలకు భద్రత లేకుండా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

బాలురు 13

మొత్తం విద్యార్థులు 16,800

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతిబాపూలే గు రుకుల పాఠశాలలు, కళాశాలలు 26 ఉన్నా యి. ఇందులో ఐదో తరగతి నుంచి ఇంటర్మీ డియెట్‌ వరకు నాణ్యమైన విద్య అందిస్తున్నా రు. ఆదిలాబాద్‌ (బాలికలు), జైనథ్‌ బాలు రు, లక్సెట్టిపేట బాలుర పాఠశాల, కళాశాల కు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మి గతావి అద్దె భవనాల్లో కొనసాగుతుండగా వీ టిల్లో కొన్ని అరకొర వసతులతో ప్రభుత్వ కా ర్యాలయ భవనాల్లో కొనసాగుతున్నాయి. వి ద్యార్థులు ఇరుకు గదుల్లో ఉంటూ విద్య అభ్యసిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల నూతన భవనాలకు శంకుస్థాపనలు చేసినా నిర్మాణాలను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న 26 మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలల్లో మూడింటికే సొంత భవనాలు ఉన్నాయి. కొన్ని అద్దె భవనాలలో కొనసాగుతుండగా, మరికొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాల్లో కొనసాగుతున్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.

– శ్రీధర్‌, ఆర్‌సీవో, మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాల, కళాశాలలు

ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement