నర్సాపూర్(జి): మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం సాయంత్రం వాహన తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ముగ్గురు మైనర్లు, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న ఇ ద్దరు, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్న ఇద్దరు, తప్పుడు నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన నలుగురితో పాటు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలి పారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురికి జరిమానాలు విధించామన్నారు. ఏఎస్సై శంకర్, హెడ్ కానిస్టేబుల్ చిన్నయ్య, కాని స్టేబు ళ్లు మోహన్, శంకర్, మొయిజ్ పాల్గొన్నారు.


