● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,317 మంది ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఐఈవో అంజయ్య | - | Sakshi
Sakshi News home page

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,317 మంది ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఐఈవో అంజయ్య

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

● జిల

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,317 మంది ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఐఈవో అంజయ్య

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 25 నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశాం. మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఇప్పటికే రోజుకు రెండు పూటలు గంటపాటు స్పెషల్‌క్లాస్‌లు జరుగుతున్నాయి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ప్రయోగ పరీక్షల నిర్వహణంతా సీసీ కెమెరాల పర్యవేక్షణ సాగింది. ఇదేతీరుగా మాల్‌ప్రాక్టీస్‌ లేకుండా నిఘా కెమెరాలు కొనసాగించనున్నాం. పరీక్షలు సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని డీఐఈవో అంజయ్య తెలిపారు. మరో మూడు రోజుల్లో జరుగనున్న ఇంటర్‌ పరీక్షల ఏర్పాట్లపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరాలు వెల్లడించారు.

సాక్షి: మెరుగైన ఉత్తీర్ణతకు చేపట్టిన ప్రణాళికలు ఏమిటి?

డీఐఈవో: గతేడాది ప్రథమ సంవత్సరంలో 54.48 శాతం, ద్వితీయ సంవత్సరంలో 67.85 శాతం ఉత్తీర్ణత సాధించాం. ఈఏడాది మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతులు, మాదిరి పరీక్షలు నిర్వహిస్తున్నాం. నవంబర్‌ 1 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఎంసెట్‌ కోచింగ్‌, స్పెషల్‌ ప్రిపరేషన్‌ జరుగుతోంది. ఉద యం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు స్పెషల్‌ క్లాస్‌లు జరగుతున్నాయి. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. 90శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.

సాక్షి: పరీక్షకు ఎంతమంది విద్యార్థులు హాజరుకానున్నారు?

డీఐఈవో: జిల్లా వ్యాప్తంగా 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. మొత్తం 12,317 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,372 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 888 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 5,227 మంది, వొకేషనల్‌ విద్యార్థులు 830 మంది పరీక్షకు హాజరుకానున్నారు.

సాక్షి: పరీక్షల నిర్వహణపై వివరించండి?

డీఐఈవో: పరీక్ష కేంద్రం ఆవరణ, ప్రశ్నపత్రాలు తెరిచే గదిలో సీసీ కెమెరాలు ఉంటాయి. ఇంటర్‌ బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలున్నాయి. ఇందులో ప్రభుత్వ కళాశాలలు–10, ప్రైవేట్‌ కళాశాలలు –7, రెసిడెన్షియల్‌లో–10 సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం. ప్రతీ కళాశాలలో నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. ప్రిన్సిపాల్‌ గది, ఎగ్జామ్‌ బ్రాంచ్‌, ప్రిన్సిపాల్‌ గది ముందర వరండా, గేట్‌ దగ్గర కెమెరాలు బిగించాం.

సాక్షి: కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు?

డీఐఈవో: ప్రతీ కేంద్రంలో తాగునీటి వసతితో పాటు వెలుతురు సరిగే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంటర్నెట్‌, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించాం. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం.

సాక్షి: మాస్‌ కాపీయింగ్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

డీఐఈవో: పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. ప్రతీ 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌, 23 మంది సీఎస్‌, 23 మంది డీవోలను నియమించాం. సిట్టింగ్‌ స్క్వాడ్‌ 2, ఫ్ల్లైయింగ్‌ స్క్వాడ్‌ 1 టీంను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్ప డితే మూడేళ్లు డిబార్‌ చేస్తారు. భయం, ఒత్తిడి ఉంటే టెలీమానస్‌ నంబర్‌ 14418 సేవలు అందుబాటులో ఉన్నాయి.

సాక్షి: హాల్‌టికెట్‌పై వివరించండి..

డీఐఈవో: ఈనెల 18 నుంచి బోర్డు కళాశాల లాగిన్‌లో హాల్‌టికెట్లు పెట్టారు. రిజిస్టర్‌, ఫోన్‌ నంబర్‌కు బోర్డు నేరుగా పంపుతుంది. పేరు, ఫొటో, సబ్జెక్టు వివరాల్లో తప్పులు దొర్లితే ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకోవచ్చు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. రెండు రోజుల్లో ఆన్‌లైన్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంటుంది. హాల్‌టికెట్‌పై సంతకం, స్టాంపు అవసరం లేదనే విషయాన్ని పరీక్ష నిర్వాహకులకు సూచించాం.

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,1
1/2

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,2
2/2

● జిల్లాలో 23 కేంద్రాలు ● హాజరుకానున్న విద్యార్థులు 12,

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement