ఖాళీ బిందెలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో నిరసన

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

ఖాళీ బిందెలతో నిరసన

ఖాళీ బిందెలతో నిరసన

భీమారం: మద్దికల్‌లోని ఎస్సీకాలనీ మహిళలు శనివారం తాగునీటికోసం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈమేరకు మహిళలు మాట్లాడుతూ ఎస్సీకాలనీకి మిషన్‌ భగీరథ పైపులైన్‌ వేయకపోవడంతో దూరంలో ఉన్న బోరు వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని, అది కూడా సక్రమంగా పనిచేయడంలేదని వాపోయారు. వేసవికాలం ప్రారంభంలోనే నీటికో సం నానాపాట్లు పడుతున్నామని, మున్ముందు పరిస్థితి తల్చుకుంటే భయమేస్తోందన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిషన్‌ భగీరథ పైపు లైను ఎస్సీకాలనీ వరకు పొడగించి ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement