దౌర్జన్యాలను అడ్డుకున్నందుకే సుమన్ అరెస్టు
రామకృష్ణాపూర్: మంత్రి వివేక్, అతని కుమారుడు ఎంపీ వంశీకృష్ణ దౌర్జన్యాలను అడ్డుకున్నందుకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అ రెస్టు చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. క్యాతనపల్లిలోని సుమన్ స్వగృహంలో శనివారం మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చందర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. క్యాతనపల్లిలో మున్సిపల్ ఎన్నికలు యుద్ధవాతావరణాన్ని సృష్టించాయ ని, పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించారన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా క్యాతనపల్లిపై బీఆర్‌ఎస్, సీపీఐ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, టీబీజీకేఎస్ నేతలు మిర్యాల రాజిరెడ్డి, సంపత్ పాల్గొన్నారు.
నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు..!


