చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Feb 22 2026 8:19 AM | Updated on Feb 22 2026 8:19 AM

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

రామకృష్ణాపూర్‌: చట్టాన్ని ఉల్లంఘింస్తే కఠినచర్యలు తప్పవని డీసీపీ భాస్కర్‌ హెచ్చరించా రు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్ని కల సందర్భంగా పోలీసులు నిబంధనల ప్రకా రమే విధులు నిర్వర్తించారని, ఇరు పార్టీల వా రు గొడవకు దిగినందువల్లే ఎన్నిక వాయిదా పడిందన్నారు. క్యాతనపల్లిలో రాత్రి, పగలు పెట్రోలింగ్‌ మరింత ముమ్మరం చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించామని, ప్రజ లు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సి న అవసరం లేదన్నారు. సోషల్‌ మీడియా లేదా ఇతర వేదికలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌, మందమర్రి సీఐ రమేశ్‌, పట్టణ ఎస్సై శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement