● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Jan 27 2026 8:31 AM | Updated on Jan 27 2026 8:31 AM

● వ్య

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

మంచిర్యాలటౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందని, మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ వివిధ వ్యాపార రంగాల్లో మహిళలను భాగస్వామ్యులను చేస్తోందని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ నినాదంతో 2047 రైజింగ్‌ తెలంగాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ దేశంలో ప్రథమ స్థానంలో జిల్లాను నిలిపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..

అర్హులకు ప్రభుత్వ పథకాలు

రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు అందిస్తున్న పథకాలతో పలువురికి లబ్ధి చేకూరుతోంది. ఉచిత రవాణాతో 5.78లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. 5,33,149 గ్యాస్‌ సిలిండర్లను రూ.15.61కోట్ల రాయితీతో మంజూరు చేశాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 18,949 మంది పేదల చికిత్సకు రూ.34.04 కోట్లు ఖర్చు చేయగా, గృహజ్యోతి పథకం కోసం జిల్లాలో 1,28,713 మంది వినియోగదారులకు రూ.95.15కోట్ల లబ్ధి చేకూరింది. జిల్లాలో 10,930 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 7,772 ఇళ్లు నిర్మాణాలు ప్రారంభించారు.. 24 ఇళ్లు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. లబ్ధిదారులకు రూ.107.62 కోట్లు చెల్లించాం. మందమర్రి మున్సిపాలిటీలో 243 మందికి, క్యాతనపల్లి మున్సిపల్‌ పరిధి లో 234మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేశాం. జిల్లావ్యాప్తంగా 37వేల నూతన రేషన్‌కార్డులు జారీ చేయగా.. 2.54లక్షల వినియోగదారులకు సన్నబియ్యం అందిస్తున్నాం.

విద్య, వైద్యానికి ప్రాధాన్యం

జిల్లాలో 18 కస్తూరిభాగాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియెట్‌ వరకు నవీకరించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో 545 పాఠశాలల్లో రూ.21.58కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల విద్యార్థులకు 40శాతం డైట్‌, 200శాతం కాస్మెటిక్‌ చార్జీలు పెంచి, నూతన మెనూ అమలు చేస్తూ పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి యూని ఫాం అందించాం. లక్సెట్టిపేటలో రూ.9.80కోట్లతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల నిర్మించి తరగతులు నిర్వహిస్తున్నాం. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల నిర్మాణానికి దండేపల్లి మండలం రెబ్బనపల్లి, చెన్నూరు మండలం సోమనపల్లి, బెల్లంపల్లిలో శంకుస్థాపన చేశాం. వృత్తి విద్య శిక్షణ కోసం జిల్లాలోని మంచిర్యాల, శ్రీరాంపూర్‌, మందమర్రి, జన్నారంలోని ప్రభుత్వ ఐటీఐల్లో నాలుగు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లను రూ.170 కోట్లతో సివిల్‌, మెషినరీ పనులు పూర్తి చేసి తరగతులు నిర్వహిస్తున్నాం. చెన్నూరు పట్టణంలో రూ.47.11కోట్లతో ఏటీసీ నిర్మాణానికి భూమి పూజ చేశాం. నవభారత సాక్షరతా కార్యక్రమంలో 31,436 మందిని గుర్తించి, 3,014 మంది వాలంటీర్లను నియమించి ఉల్లాస్‌ డిజిటల్‌ యాప్‌ లో అభ్యాసన జరుగుతోంది. జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.300 కోట్లతో పనులు జరుగుతున్నాయి. రూ.23.75 కోట్లతో 50పడకల క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రి, రూ.129.25 కోట్లతో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణానికి రూ.49కోట్లతో పనులు సాగుతుండగా.. గుడిపేటలో రూ.216 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తయి తరగతులు కొనసాగుతున్నాయి. లక్సెట్టిపేటలో రూ.8.50 కోట్లతో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మించాం. రూ.3.60 కోట్లతో ఔషధ నిల్వ గిడ్డంగి భవనం పూర్తయింది. భీమారం, కన్నెపల్లి మండల కేంద్రాల్లో రూ.1.43కోట్లు చొప్పున వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం సాగుతోంది. జైపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.17 లక్షలతో రెండు అంబులెన్సులు, మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి రూ.15.2 లక్షలతో రెండు అంబులెన్సులు అందించాం. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో శివ్‌ ఆశిష్‌సింగ్‌, మంచిర్యాల అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, డీసీపీ ఎగ్గడి భాస్కర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కళలను కాపాడుకోవాలి

నస్పూర్‌: సంప్రదాయ కళలను కాపాడుకుంటూ వాటిని భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, డీఆర్డీఓ కిషన్‌, జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్‌, జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, డీఈఓ యాదయ్య, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌, పశుసంవర్థక శాఖ అధికారి శంకర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

అగ్నిమాపక, మత్స్యశాఖ, ఆర్టీసీ శకటాలు

మహిళల అభ్యున్నతి కోసం..

మహిళల అభ్యున్నతి కోసం ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాలు, చిన్న పరిశ్రమలు, ఇతర వ్యాపార విభాగాల ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తున్నాం. మూడు నియోజకవర్గాల్లోని ముగ్గురు మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల విలువైన సంచార చేపల విక్రయ వాహనం 60శాతం రాయితీతో మంజూరు చేయగా రూ.18లక్షల లబ్ధి చేకూరింది. వడ్డీలేని రుణాల కింద గత ఏడాది 2,704 స్వయం సహాయక సంఘాలకు రూ.261 కోట్లు అందించాం. సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు దండేపల్లి మండలంలో శంకుస్థాపన చేశాం.

రైతులకు లబ్ధి చేకూర్చేలా

జిల్లాలోని 64,452 మంది రైతులకు రూ.540.66 కోట్ల రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద 2025–26 వానాకాలం పంటకు 1,52,162 మంది రైతులకు రూ. 198.13 కోట్లు అందించాం. రైతుబీమా పథకం కింద 2025 ఆర్థిక సంవత్సరానికి 109మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున రూ.5 కోట్లు చెల్లించాం. 2025 వానాకాలం ధాన్యం కొనుగోలుకు రూ.1,57,642 ఎకరాల్లో పండిన 91,881 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేశాం. 27,114మంది రైతుల నుంచి 5.48 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసి రూ.438 కోట్లను చెల్లించాం. ఆయిల్‌ఫామ్‌ తోటల కోసం 485 ఎకరాల్లో మొక్కలు నాటగా, జిల్లాలో 650 మంది రైతులు 2,100 హెక్టార్లలో దసలి పట్టు సాగు చేశారు.

స్టాళ్ల వద్ద కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, జిల్లా అధికారులు

అలరించిన విద్యార్థుల నృత్యాలు

వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి. శర్వాణి నృత్యాలయం, నందిని నృత్యాలయం, ఎస్సీ హాస్టల్స్‌ బాలికల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబరిచిన వారికి కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం ఆరోగ్యశాఖ, మత్స్య శాఖ, ఐసీడీఎస్‌, రవాణా శాఖ, ఫైర్‌, అగ్రికల్చర్‌, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి, సఖి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అభివృద్ధిని శకటాల రూపంలో ప్రదర్శించారు.

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌1
1/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌2
2/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌3
3/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌4
4/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌5
5/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌6
6/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌7
7/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌8
8/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌9
9/9

● వ్యాపార రంగాల్లో మహిళల భాగస్వామ్యం ● జిల్లా కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement