దేశాభివృద్ధికి ప్రతీ పౌరుడు బాధ్యత వహించాలి
చెన్నూర్: ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతీ పౌరుడు బాధ్యతగా ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం అందరికీ ఉద్యోగ అవకాశాలు, సమాన హక్కులు, స్వేచ్చనిచ్చిందని తెలిపారు. మంత్రి ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


